కందుకూరు: పేదరికం లేని సమాజం కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది

పేదరికం లేని సమాజ నిర్మాణం కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఉలవపాడు పంచాయతీ అంబేద్కర్ నగర్ లో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పెన్షన్ పెంపుదల, ఉచిత గ్యాస్, తల్లికి వందనం, పథకాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. పథకాలు అందని వారి వివరాలు నమోదు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్