కందుకూరు డిఎస్పి సీరియస్ వార్నింగ్

కందుకూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో సంక్రాంతి పండుగ పేరుతో ఎలాంటి జూదం ఆడినా కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. పేకాట, కోడి పందాలు, మరే ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేట్ స్థలాల్లో ఇలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తే ఆ స్థల యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. పండుగ పూట ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్