కందుకూరు: పాలిటెక్నిక్ కళాశాలలో 5వ తేదీ స్పాట్ అడ్మిషన్లు

కందుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఎలక్ట్రికల్ సివిల్ డిప్లమో సీట్లకు ఈనెల 5వ తేదీన స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రియాజుద్దీన్ శుక్రవారం తెలిపారు. టెన్త్ పాసై పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాయని విద్యార్థులు కూడా స్పాట్ అడ్మిషన్స్ కోసం పాల్గొనవచ్చని అన్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే అడ్మిషన్స్ లో సీటు పొందిన విద్యార్థులు రూ. 6 వేలు ఫీజు చెల్లించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్