కందుకూరు: టీడీపీ నాయకుడు కండ్రా అరుదైన గౌరవం

కందుకూరుకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కండ్రా మాల్యాద్రికి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశిష్ట సేవలకు గాను అరుదైన గౌరవం లభించింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహం, మంగళగిరి చేనేత వస్త్రాలను అందుకున్నారు. మున్సిపల్ కౌన్సిలర్‌గా, రెండుసార్లు పట్టణ అధ్యక్షుడిగా పనిచేసిన మాల్యాద్రి, సీనియర్ల సేవలను గుర్తించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్