కందుకూరు: "నాటి సీఎం రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో దించేశాడు"

గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో దించేసి ఆర్థికంగా ఇబ్బందులు సృష్టించారని, ఈ ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా అన్ని అధిగమించి మన సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. గుడ్లూరు మండలం చేమిడిదిపాడు గ్రామంలో గురువారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్