లింగసముద్రం: ప్రమాదవశాత్తు గడ్డి వాము దగ్ధం

నెల్లూరు జిల్లా లింగసముద్రం పంచాయతీలోని వాకములవారిపాలెంలో శనివారం ప్రమాదవశాత్తు వరిగడ్డి వాము అగ్నికి ఆహుతయింది. గ్రామానికి చెందిన రైతు మన్నెం ఆదినారాయణ రెడ్డి పశువుల మేతకు వరిగడ్డి వాము వేసుకున్నాడు. ప్రమాదవశాత్తు గడ్డివాము కాలిబూడిదవడంతో రూ. 10,000 నష్టం జరిగిందని వాపోయాడు. అయితే ప్రమాదానికి కారణాలు ఏంటో స్పష్టంగా తెలియలేదు.

సంబంధిత పోస్ట్