లింగసముద్రం ఎస్సై హెచ్చరికలు

లింగసముద్రం మండలంలో కోడిపందేలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నారాయణ హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక బృందాలతో నిరంతర నిఘా కొనసాగుతుందని, ముందస్తు చర్యల్లో భాగంగా పాత నేరస్తులను బైండోవర్ చేసి వారి కదలికలపై పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. వీటి నిర్వహణపై సమాచారం ఉంటే తెలపాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్