ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మాలకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఇటీవల నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ. 17, 74, 810 ఆదాయం లభించింది. ప్రధాన హుండీ ద్వారా రూ. 7, 62, 743, ప్రసాద విక్రయాల ద్వారా రూ. 3, 36, 610, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ. 4, 98, 700 ఆదాయం సమకూరింది. తలనీలాల ద్వారా రూ. 81, 275, వివిధ పూజల ద్వారా రూ. 62, 832, గదుల అద్దెల ద్వారా రూ. 32, 650 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.