కందుకూరుకు కొత్త బస్సు సర్వీసులు ప్రారంభించిన MLA ఇంటూరి

కందుకూరు ఆర్టీసీ డిపో నుంచి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ఐదు కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించారు. వీటిలో కందుకూరు-గుంటూరు మధ్య మూడు, గుడ్లూరు-ఉలవపాడు మీదుగా హైదరాబాద్ BHEL వరకు ఒకటి, విశాఖపట్నంకు మరో సర్వీసు ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సేవలు అందుబాటులోకి తెచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. పాత బస్సుల స్థానంలో కొత్తవాటిని తీసుకురావాలని మంత్రితో మాట్లాడతానని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్