విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఇంటూరి ప్రత్యేక కృషి

కందుకూరు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆయన విజయవాడలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, APCPDCL CMD పుల్లారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కందుకూరు, పలుకూరు, చేవూరు, వెంగళాపురంలో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, హైమాస్ట్ పోల్స్, రైతులకు అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు మంజూరు చేయాలని కోరారు. రెండు మూడు నెలల్లో ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుందని అధికారులు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్