కందుకూరు నియోజకవర్గంలో కొత్త పరిశ్రమల రాకతో అభివృద్ధి వేగం పుంజుకోబోతుందని, ప్రజలందరికీ మేలు చేసే అలాంటి అభివృద్ధిని అందరూ స్వాగతించాలి తప్ప అడ్డుపడవద్దని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. కరేడు రైతులకు చిన్న ఇబ్బంది కూడా జరగకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు. కందుకూరులో గురువారం ఆయన మాట్లాడారు. ఎకరాకి 20 లక్షలు, ఇంటికో ఉద్యోగం కరేడు రైతుల కోసం మెరుగైన ప్యాకేజీ అని తెలిపారు.