గుడ్లూరు ఎస్టీ కాలనీలో బుధవారం పేకాటరాయుళ్లపై ఎస్ఐ వెంకట్రావు సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2,640 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.