చినపవనిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

చినపవని పంచాయతీలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. తన గెలుపులో గ్రామస్తుల పాత్ర ఎంతో ఉందని, అభివృద్ధితో వారి రుణం తీర్చుకుంటానన్నారు. లింగసముద్రం మండలం సత్యనారాయణపురంలో రూ. 26 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. గత 22 నెలల్లో రూ. 50 లక్షలతో పనులు చేసినట్లు చెప్పారు. అలాగే రూ. 6 లక్షలతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించి దాతలను అభినందించారు.

సంబంధిత పోస్ట్