అనుమానంతో మహిళను హత్య చేసిన నిందితుడు అరెస్టు

లింగసముద్రం మండలం పెంట్రాల గ్రామానికి చెందిన జయంపు గోవిందమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెతో సహజీవనం చేస్తున్న వెంకటేశ్వర్లు అనుమానంతో వేధింపులకు పాల్పడి, ఈ నెల 11న కత్తితో హత్య చేసినట్లు విచారణలో తేలింది. గుడ్లూరు సీఐ నరేశ్‌కుమార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు నిందితుడిని సాయిపేట గ్రామ శివారులో అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు.

సంబంధిత పోస్ట్