కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, జలధార కార్యక్రమంలో భాగంగా సాగునీటి వనరుల సంరక్షణపై అధికారులు, సాగునీటి సంఘాల ప్రతినిధులకు సూచనలు చేశారు. ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యంగా పని చేయాలని తెలిపారు. కందుకూరులో నిర్వహించిన సమావేశంలో అభివృద్ధి పనులు, పెండింగ్ అంశాలపై చర్చించారు. కొండికందుకూరు చెరువును సందర్శించి రైతులతో మాట్లాడారు. రాళ్లపాడు రిజర్వాయర్‌కు రూ. 2. 5 కోట్లు, చెరువుల అభివృద్ధికి రూ. 10 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు.