కొత్తపల్లిలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట

ప్రకాశం జిల్లా పామూరు మండలం కొత్తపల్లి గ్రామంలో అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం వైభవంగా ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు వై.ఎం. ప్రసాద్ రెడ్డి, మార్కాపురం జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఎస్.కె. గాయాజ్, నాయకులు బన్ని, మారంరెడ్డి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్