నేడు కందుకూరులో ఇద్దరు మంత్రులు పర్యటన

కందుకూరు పట్టణంలో శనివారం జరగనున్న ఇద్దరు మంత్రుల పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మియావాకి ప్రాజెక్టు ప్రారంభం, టిడ్కో కాలనీలో సిసి రోడ్డు శంకుస్థాపన, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. అధికారులు, పోలీసులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచనలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్