నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు రామకృష్ణాపురం గిరిజన కాలనీలో మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ శుక్రవారం పర్యటించారు. ఇటీవల ముగ్గురు గిరిజన మహిళలు అరెస్ట్ అయ్యి జైలు నుంచి బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. నేపథ్యంలో బుర్రా వారిని కలిసి పరామర్శించారు. భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు మహిళలను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. కరేడు ప్రాంత రైతులకు అండగా వైసిపి పార్టీ ఉంటుందన్నారు.