ఉలవపాడు: భూసేకరణ పై గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాలి

ఉలవపాడు మండలం, కరేడులో ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణను అడ్డుకోవడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాలని CPM ఉలవపాడు ఏరియా కమిటీ నిర్ణయించింది. ఆదివారం కందుకూరులో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రామకృష్ణాపురం STకాలనీ, ఉప్పరపాలెం SC కాలనీలను బలవంతంగా ఖాళీ చేయించకుండా కాపాడాలని సోమవారం చెన్నైలోని గ్రీన్ ట్రిబ్యునల్ కు విజ్ఞప్తి చేస్తామని పార్టీ నేత GVB కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్