ఉలవపాడు: ఫిబ్రవరి 12న అంగన్వాడిల దేశవ్యాప్త సమ్మె

ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న అంగన్వాడీల సమ్మెకు సంబంధించి CITU జిల్లా కార్యదర్శి జివి, ఉలవపాడులో అధికారులకు నోటీసును అందజేశారు. ఉలవపాడు ప్రాజెక్టు పరిధిలోని 183 అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటారని ఆయన తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 26 వేలు నిర్ణయించి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్