ఉలవపాడు: 'ప్రాణత్యాగాలకైనా సిద్ధం'

ఇండోసోల్ ప్రాజెక్టు కోసం భూములు ఇవ్వబోమని, అవసరమైతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెసి పెంచలయ్య స్పష్టం చేశారు. ఉలవపాడు మండలం కరేడులో సంఘం బృందం పర్యటించింది. భూసేకరణ ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని కోరారు. ప్రయత్నిస్తే తీవ్ర పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు, ఒంగోలు జిల్లాల అధ్యక్షులు మురళీ, మాల్యాద్రి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్