కందుకూరు పట్టణంలోని బూడిద పాలెం వెళ్లే మార్గంలో ఓ యువకుడు అపస్మారక స్థితిలో శనివారం రాత్రి పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. అతనిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే అతను మృతి చెందినట్లు టౌన్ ఎస్ఐ శివ నాగరాజు ఆదివారం తెలిపారు. అతని ఛాతిపై నరసింహ, యముడు అని పచ్చబొట్టు ఉంది. మృతుడు వివరాలు తెలిసినవారు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.