వలేటివారిపాలెం: జాతీయ రహదారిపై ప్రమాదం.. ఒకరికి గాయాలు

వలేటివారిపాలెం మండలం పోకూరు–కూనిపాలెం మధ్య జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో జార్ల మాలకొండయ్య గాయపడ్డారు. మోపెడ్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్