వలేటివారిపాలెం: వ్యక్తి మృతి కేసులో నిందితుడికి జైలు

ఒక వ్యక్తి మృతి కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి జి.దీన గురువారం తీర్పు ఇచ్చారు. వలేటివారిపాలెం మండలం చుండికి చెందిన తాడిబోయిన చిరంజీవికి 10 ఏళ్ల శిక్షతోపాటు రూ.7,000 జరిమానా విధించారు. మిగిలిన నిందితులకు రూ.1,000 చొప్పున జరిమానా విధించారు. 2018లో మద్యం మత్తులో వివాదం చెలరేగి ఆవుల వెంగయ్య హత్యకు గురయ్యాడు.

సంబంధిత పోస్ట్