వరికుంటపాడు: జాతీయ రహదారిపై రైతులు ఆందోళన

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జంగంరెడ్డి పల్లి లో మైనింగ్ అనుమతులు ఇవ్వొద్దంటూ జాతియ రహదారిపై గ్రామస్తులు, రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. హైవేపై బైఠాయించి నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామంలో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. హైవేపై ఆందోళన చేయడంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కొంతసేపు ట్రాఫిక్ జామ్ అయింది.

సంబంధిత పోస్ట్