పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ కందుకూరు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో మార్కెట్ కమిటీ యార్డు వద్ద నుండి టిటిడి కళ్యాణ మండపం వరకు మెగా మహాకరుణ శాఖాహార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాఖాహార జీవనశైలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరానికి ఆరోగ్యం, మనస్సుకు శాంతి సమకూరుస్తుందన్నారు.