పదో తరగతిలో లిఖిత అద్భుత ప్రతిభ, టీడీపీ నేతల అభినందనలు

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తెల్లపాడు గ్రామానికి చెందిన చిట్టినేని లిఖిత పదో తరగతి పరీక్షల్లో 598 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచింది. తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చిట్టినేని వేణు కుమార్తె అయిన లిఖిత సాధించిన ఈ విజయంపై మాజీ ఎంపీపీ, టీడీపీ అధికార ప్రతినిధి మద్దసాని వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిన లిఖితను, ఆమె కుటుంబ సభ్యులను మరియు పాఠశాల యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్