గత నెల 17న అల్లూరు మండలం సింగంపేట వద్ద కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన గాయపడిన వారిలో నాగరాజు నాలుగు రోజుల క్రితం, హజరతయ్య ఆదివారం మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.