అల్లూరు మండలంలో వాతావరణం రోజురోజుకు మారుతోంది. శుక్రవారం ఉదయం పలు ప్రాంతాల్లో భారీగా పొగమంచు ఏర్పడటంతో రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. దూరంగా ఉన్న వాహనాలు దగ్గరకు వచ్చే వరకు గుర్తించలేకపోతున్నారు. ఉదయాన్నే పనులకు వెళ్లే కూలీలు, విద్యార్థులు ఈ మంచు ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పచ్చని పొలాలు పొగమంచుతో కోనసీమ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.