అల్లూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం పంచాయతీ పురోగతి పై సూచిక వర్షన్ 2.0 శిక్షణ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించారు. పంచాయతీల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో ప్రస్తావించారు. పంచాయతీ ఖర్చులు, ఆదాయ వనరుల మార్గాలు వాటిపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శశిరేఖ, ఎంపీడీవో రజినీకాంత్, అధికారులు పాల్గొన్నారు.