ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి: కాకాణి

కావలిలోని ఆర్‌ఎస్‌ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన బూత్ లెవల్ ఏజెంట్ల అవగాహన సమావేశంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, అర్హుల ఓట్లను తొలగించే కుట్రలను సమర్థంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. ప్రతి ఓటును భద్రంగా కాపాడుకోవడం ప్రజాస్వామ్యంలో కీలకమని, కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్