బోగోలు మండలం కోవూరుపల్లి హైవేపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కెనరా బ్యాంకు ఉద్యోగి నాగరాజు (35) మృతి చెందారు. అల్లూరులోని కెనరా బ్యాంకులో పనిచేస్తున్న నాగరాజు, విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.