బోగోలు: కోనేటిలో పడి వ్యక్తి మృతి

బోగోలు మండలం కొండబిట్రగుంట వద్ద శ్రీవారి కోనేటిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని బోగోలు కుమ్మరివీధికి చెందిన పూర్ణచంద్రరావు (32)గా గుర్తించారు. కొయ్య పని కోసం అక్కడికి వెళ్లిన ఆయన ముఖం కడుక్కునే సమయంలో ప్రమాదవశాత్తు జారిపడినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్