బోగోలు మండలం, కొండ బిట్రగుంట అభివృద్ధికి కృషి చేస్తానని, శిరిడి సాయిబాబా ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తామని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్నారు. గురువారం కొండ బిట్రగుంటలో ద్వారకా నగర్ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి ఎంపీ బీదా మస్తాన్ రావుతో కలిసి ఎమ్మెల్యే వెళ్లారు. స్వామి వారిని దర్శించుకున్నారు. కావలి బిజెపి పట్టణ అధ్యక్షుడు బ్రహ్మానందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎద్దుల పందాల పోటీని ప్రారంభించారు.