ఇరాన్‌పై దాడులను ఖండిస్తూ కావలిలో సిపిఐ నిరసన

కావలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ నిరసన తెలిపారు. సీపీఐ నేతలు బిళ్ల పురుషోత్తం, మండ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ దాడులు ప్రపంచ శాంతికి ముప్పు తెస్తున్నాయని పేర్కొన్నారు. సమస్యలను యుద్ధాలతో కాకుండా దౌత్య చర్చల ద్వారా పరిష్కరించాలని, అమెరికా జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్