దగదర్తి: మామపై రోకలి బండతో కోడలు దాడి

మామపై కోడలు రోకలితో దాడి చేసిన ఘటన దగదర్తి మండలం దామవరంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిన వెంకయ్య, దొరసానమ్మ దంపతుల కోడలు సంపూర్ణమ్మ. ఆమెకు అత్తతో తరచూ గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో ఇంట్లోనే వేరుగా ఉంటుంది. ఈ విషయమై మామ ఆమెను మందలించాడు. దీంతో నిద్రిస్తున్న మామపై రోకలి బండతో దాడికి పాల్పడింది. బంధువులు అతడిని చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రిలో చేర్చారు.

సంబంధిత పోస్ట్