రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన స్పాజ్ పెన్షన్లు ఆగస్టు 1వ తేదీ నుంచి కావలి నియోజకవర్గంలోని మూడు మండలాలలో పంపిణీ చేయనున్నట్లు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. రేపు ఉదయం 8: 30 గంటలకు కావలి ఎంపిడిఓ కార్యాలయం ప్రాంగణంలో, మధ్యాహ్నం 2 గంటలకు దగదర్తి ఎంపీడీవో కార్యాలయంలో, సాయంత్రం 4 గంటలకు అల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో నూతన స్పాజ్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.