తురిమెర్ల పాఠశాలలో ఎర్త్ అవర్ పై అవగాహన ర్యాలీ

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం తురిమెర్ల గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎర్త్ అవర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాడి వంశీ చరణ్ తెలిపిన వివరాల ప్రకారం, 2007లో ప్రారంభమైన ఈ కార్యక్రమం, ప్రతి సంవత్సరం మార్చి చివరి శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు ఒక గంట పాటు విద్యుత్ ఆదా చేసేందుకు ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంగా గ్రామంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్