నెల్లూరు జిల్లా కలిగిరి పట్టణానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు గంజాం అంకయ్య (మీసాల అంకయ్య) ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, కలిగిరి యూనిట్ ఇంచార్జ్ ఊసా మాల్యాద్రి, పట్టణ అధ్యక్షులు జిర్రా చిన్న అంకిరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య తదితరులు అంకయ్య నివాసాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బిజ్జం వెంకటకృష్ణారెడ్డి రూ.10,000, ఊసా మాల్యాద్రి రూ.2,000, స్వర్ణ కొండయ్య రూ.2,000, జిర్రా అంకిరెడ్డి రూ.2,000 చొప్పున మొత్తం రూ.16,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేశారు.