కావలి పట్టణంలోని బీపీఎస్ సెంటర్ వద్ద టీడీపీ శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు మానుకోవాలని, అంబటిని రాజకీయాల నుంచి బహిష్కరించాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. పోలీసులు పరిస్థితిని పర్యవేక్షించారు.