మన్నగదిన్నెలో మట్టి తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

కావలి మండలం మన్నగదిన్నె గ్రామంలో కాలువలు, చెరువుల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రాత్రి వేళల్లో సహజ వనరుల దోపిడీ జరుగుతోందని ఆయన ఆరోపించారు. అక్రమ త్రవ్వకాలపై అధికారులు తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సంపదను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్