ఘనంగా లక్ష్మీ కుబేర పూజా కార్యక్రమం

దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ఆవరణలో ఆదివారం శ్రీ లక్ష్మీ కుబేర పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ ఈ పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕