కావలి మండలంలోని రుద్రకోట గ్రామంలో శనివారం బంధువుల మధ్య జరిగిన దాడిలో ఇద్దరు గాయపడ్డారు. గత నెల 27న జరిగిన వివాహానికి ఎందుకు రాలేదని అడిగినందుకు, పెద్దమ్మ రమణమ్మ రోకలిబండతో లక్ష్మీ, కల్యాణ్‌లపై దాడి చేశారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కావలి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.