అమరావతిలో ఆత్మీయ సమావేశం

అమరావతిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆహ్వానంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ భేటీకి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మంత్రి అందించిన ఆత్మీయ స్వాగతం, చూపించిన ప్రేమాభిమానాలు తమను హత్తుకున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రజాసంక్షేమ కార్యక్రమాలపై స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయి. మంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్