కావలి పట్టణంలోని రవి నర్సింగ్ హోమ్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ర్యాంకర్స్ డే, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై చర్చించి, పలు తీర్మానాలు చేశారు. శాస్త్రీయ దృక్పథం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాలని నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం "జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేరండి" అనే గోడపత్రికను ఆవిష్కరించారు.