కావలి: 63 పందుల చోరీ.. కేసు నమోదు

పందుల చోరీ ఘటనపై కావలి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం పి. పెంచలయ్య అనే వ్యక్తి తుమ్మలపెంట పంచాయతీ పరిధిలో ఉన్న కంపోస్ట్ యార్డ్ వద్ద పందులు పెంచుకుంటున్నాడు. 63 పందులను రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.

సంబంధిత పోస్ట్