ఉలవపాడు మండలం కరేడుకు చెందిన వివాహిత మహిళ అదృశ్యంపై కావలి రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం కావలికి వచ్చారు. ఈ సందర్భంగా ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వద్ద దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేస్తున్న క్రమంలో ఆమె కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె కోసం విచారణ మొదలుపెట్టారు.