కావలి రూరల్ మండలం గౌరవరం ఫారెస్ట్ నర్సరీ ఎదురుగా గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట నుంచి ఒంగోలుకు వెళ్తున్న స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వీరు నాయుడుపేటలో పనిచేస్తూ సొంతూరికి చెల్లి పెళ్లి కోసం సంతోషంగా వెళ్తున్న వారిని కంటైనర్ రూపంలో మృత్యువు వెంటాడింది.