గురువారం కావలి మండలం ముసునూరు టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌరవరం గ్రామానికి చెందిన యాదగిరి కోటయ్య మరణించాడు. రోడ్డు పక్కన ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకుంటున్న కోటయ్యను, మద్యం మత్తులో వేగంగా వచ్చిన పల్సర్ బైక్ నడుపుతున్న వ్యక్తి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కోటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కావలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.