రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన కావలి ఎమ్మెల్యే

దగదర్తి మండలం, తురిమెర్ల గ్రామంలో రైతుల భూ హక్కులకు భరోసా కల్పిస్తూ కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి రాజముద్రతో పొలం పట్టా పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు ప్రజలకు ఉపయోగపడే, రైతులకు మేలు చేసే కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్